Published 09 Dec 2023
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి అత్యంత ప్రజాదరణ(Most Popular) నేతగా గుర్తింపు సాధించారు. అలాంటిలాంటి రికార్డు కాకుండా ప్రపంచంలోనే ఏ నాయకుడికి లేనటువంటి రికార్డును సొంతం చేసుకున్నారు. వరల్డ్ లోనే అత్యధిక ప్రజామోదం గల నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని మూడు రెట్లకు పైగా దాదాపు 76 శాతం మంది ప్రజలు కోరుకుంటుండగా.. కేవలం 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయం బయటపడింది. ప్రధాని తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రేడర్ ఉన్నారు. ఒబ్రేడర్ నాయకత్వాన్ని(Leadership) మెక్సికోలో 66 శాతం మంది ఆమోదిస్తుండగా, 29 శాతం మంది ప్రతికూలంగా ఉన్నట్లు సర్వే తెలియజేసింది. ఈ మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ రెగ్యులర్ గా సర్వేలు నిర్వహిస్తుంటుంది. ఇలా భారతదేశ ప్రధాని మోదీ మరోసారి ప్రజాదరణలో టాప్ ప్లేస్ లో నిలవడం, అదీ ప్రపంచంలోనే ఏ నేతకు లేని రీతిలో ప్రజామోదం దక్కడం ఆసక్తికరంగా మారింది.
అభివృద్ధి పరంగా ప్రపంచంలోనే భారత్ ను మూడో స్థానంలో నిలపాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక వృద్ధి రేటు ఏటేటా పెంచుకుంటూ పోతూ దేశాన్ని పురోభివృద్ధి దిశగా సాగించాలన్న కలతో ముందుకు సాగుతున్నారు. అవినీతిరహిత పాలన వల్లే మోదీకి ఇంత ప్రజాదరణ దక్కిందనేది ఈ సర్వేని బట్టి అర్థమవుతున్నది. దేశంలోని జనాభాలో 100 కోట్ల మందికి పైగా ఆయన నాయకత్వాన్ని హర్షిస్తున్నారంటే గతంలో ఏ నేతకూ ఇంతటి ప్రజాదరణ దక్కలేదని ఈ సర్వే ద్వారా స్పష్టమైంది.