Published 09 Dec 2023
ఇంతకుముందు ప్రచారం జరిగినట్లుగా కాకుండా మంత్రులందరూ కొత్త శాఖల్లో చేరబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించారు. మొన్న ఎల్.బి.స్టేడియంలో ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఆనాడే శాఖలు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ రెండు రోజుల వరకు వారికి శాఖలు కేటాయిస్తూ నోటిఫికేషన్ విడుదల కాలేదు. తాజాగా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆయా మంత్రులకు శాఖలు కేటాయిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక, ఇంధన శాఖల మంత్రిగా నియమితులయ్యారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు IT శాఖను, రహదారులు, భవనాలు(ఆర్ అండ్ బీ) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు కట్టబెట్టారు. హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్ని రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు.
మంత్రుల శాఖలివే…
భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధనం
శ్రీధర్ బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటి పారుదల, పౌరసరఫరాలు
దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్యం, సైన్ అండ్ టెక్నాలజీ
సీతక్క – మహిళా సంక్షేమం, పంచాయతీ రాజ్
తుమ్మల నాగేశ్వర్ రావు – వ్యవసాయం, చేనేత పరిశ్రమలు
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్, పర్యాటకం
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార
కొండా సురేఖ – దేవాదాయ, అటవీ, పర్యావరణం
పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమం