Published 12 Nov 2023
ఎన్నికల సంఘం(Election Commission) ఆగ్రహానికి గురై సస్పెన్షన్ వేటు పడిన IPS అంజనీ కుమార్ వ్యవహారంలో EC కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. తనను సస్పెండ్ చేయడం వల్ల అంజనీకుమార్.. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఎన్నికల ఫలితాల రోజున రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాము అలా వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగబోవంటూ కావాలనే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్.. సీనియర్ IPS అంజనీకుమార్ సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది.
రిజల్ట్స్ రాకముందే
DGPగా బాధ్యతల్లో ఉన్న సమయంలో ఎలక్షన్ రిజల్ట్స్ పూర్తిగా రాకముందే రేవంత్ రెడ్డిని అంజనీకుమార్ కలిశారు. ఈ నెల 3న మధ్యాహ్నం మరో ఇద్దరు అడిషనల్ డీజీలు సంజయ్ కుమార్ జైన్, మహేశ్ భగవత్ తో కలిసి ఆయన రేవంత్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. దీనిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంజనీకుమార్ ను సస్పెండ్ చేయడమే కాకుండా సంజయ్, మహేశ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో వీరంతా ECకి వివరణ ఇవ్వాల్సి రాగా.. ఇలాంటి పొరపాటు మరోసారి జరగదంటూ వేడుకోవడంతో ఆయనపై సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది.