కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న చిత్రం ‘లియో’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ బ్యానర్‌పై ఎస్ ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. స్మైలింగ్ క్వీన్ త్రిష కథానాయిక. ఇటీవలే విజయ్ బర్త్‌డే సందర్భంగా లుక్ పోస్టర్ విడుదల చేయగా.. దానిపై వివాదం నెలకొంది. ఇందులో విజయ్ నోట్లో సిగరెట్‌తో కనిపించడంపై నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ స్టిల్ ‘నా రెడీ’ పాటలోనిది కాగా.. విజయ్ స్మోకింగ్, డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త కేసు ఫైల్ చేశారు. ఈ వివాదానికి లియో మేకర్స్ ఫుల్స్టాప్ పెట్టారు. ఈ పాటలో స్మోకింగ్ డిస్క్లైమర్ను యాడ్ చేసింది.
అంతేకాదు మరిన్ని చిక్కులు రాకుండా ‘నా రెడీ’ పాటలోని కొన్ని లిరిక్స్ కూడా మార్చేశారు. కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో హిట్ కొట్టిన లోకేశ్ కనగరాజ్‌కు విజయ్‌తో ఇది రెండో సినిమా. పైగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారని ప్రేక్షకులు ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ కాగా.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మొత్తానికి త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోనున్న లియో.. ఈ ఏడాది దసరాకు అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.