Published 14 Nov 2023
రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన వారం రోజులకు తొలి నిధుల్ని విడుదల చేసింది. వివిధ పథకాల(Different Schemes) కింద సబ్సిడీ నిధుల్ని రిలీజ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యుటీ CM భట్టి విక్రమార్క.. వెంటనే నిధుల్ని విడుదల చేస్తూ సంతకం చేశారు. ప్రతిష్ఠాత్మక గిరిజన జాతర అయిన సమ్మక్క-సారక్క వేడుకకు రూ.75 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఈ జాతరతోపాటు మొత్తంగా నాలుగు విభాగాలకు కలిపి రూ.1,743 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో విద్యుత్తు సబ్సిడీకి రూ.996 కోట్లు, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి రూ.374 కోట్లు సబ్సిడీ అందజేస్తుండగా, రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.298 కోట్లు వెచ్చిస్తున్నారు.
వివిధ శాఖలపై రివ్యూ చేయడమే తప్ప ఫండ్స్ ఎలా రిలీజ్ చేసేది ఉందా లేదా అన్న ప్రతిపక్షం విమర్శల దృష్ట్యా మంత్రులుగా బాధ్యతల్లో చేరిన వెంటనే ఆర్థిక మంత్రి నిధుల్ని విడుద చేశారు. ముఖ్యంగా విద్యుత్తు, ఆర్టీసీ ఫ్రీ జర్నీపై పెద్దయెత్తున చర్చ జరిగింది. విద్యుత్తు విషయంలో రూ.85 వేల కోట్ల అప్పులున్నాయని తేలడంతో ఆ శాఖకు ఇచ్చే నిధులు ఎలా ఉంటాయోనన్న మాటలు వినపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానాలకు అడ్డుకట్ట వేస్తూ పగ్గాలు చేపట్టిన వారం రోజులకే తొలి నిధుల్ని సర్కారు విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది.