
Published 14 Nov 2023
అత్యంత చిన్న వయసులోనే సివిల్ సర్వీసెస్ సాధించి రాష్ట్ర కేడర్ లో ఉన్నత స్థాయిలో ఉన్న సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్. పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసి, గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో CM కార్యాలయంలో కీలక విధులు నిర్వర్తించిన ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నిన్న ఆసక్తికర ట్వీట్ చేసి సంచలనం కలిగించారు. 23 ఏళ్ల ప్రొఫెషనలిజంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని, భవిష్యత్తులోనూ ఎలాంటి సవాళ్లకైనా సిద్ధమని ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ పెట్టి ఆశ్చర్యపరిచారు. ప్రొటోకాల్ లో భాగంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రిని కలవని ఆమె.. నిన్నటి వరకు ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనూ కనిపించలేదు. దీంతో స్మితా సబర్వాల్ పై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కొందరు ఆమె తీరును తప్పుబట్టగా ఇది రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది.

ఛానెళ్లలో తప్పుడు వార్తలు
స్మితపై ఇలాంటి కామెంట్స్ వస్తున్న వేళ ఆమె.. మంత్రి సీతక్కతో నిర్వహించిన కార్యక్రమంలో దర్శనమిచ్చారు. దీనికితోడు మరోసారి ఎక్స్ లో పోస్ట్ చేసి విమర్శలను తిప్పికొట్టారు. తాను కేంద్ర సర్వీసు(Central Deputation)ల్లోకి వెళ్తున్నట్లు కొన్ని ఛానెళ్లు తప్పుడు వార్తలు టెలికాస్ట్ చేయడం చూశానని, కానీ అది నిజం కాదంటూ స్పందించారు. ‘నేను తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ ని.. నేను ఇక్కడే కంటిన్యూ అవుతూ గవర్నమెంట్ అప్పగించే ఏ బాధ్యతైనా నిర్వర్తిస్తా.. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నాననేది పూర్తిగా తప్పుడు ప్రచారం’ అంటూ స్మిత పోస్ట్ చేశారు.