Published 17 Nov 2023
పలువురు IPS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో కొంతమందిని DGP కార్యాలయానికి అటాచ్డ్ చేయగా మరికొందరికి ముఖ్యమైన పోస్టింగ్ లు ఇచ్చారు. రాష్ట్ర రాజధానిలో కీలకమైన డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(DCP)లుగా వెస్ట్ జోన్, నార్త్ జోన్ లకు కొత్త అధికారులు రాబోతున్నారు. స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ CPగా ఉన్న పి.విశ్వప్రసాద్ ను ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా నియమించారు. నితిక పంత్, గజరావ్ భూపాల్, చందన దీప్తిని రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలకు స్థాన చలనం కల్పించారు.
అధికారులు – పోస్టింగ్స్
పి.విశ్వప్రసాద్ – అడిషనల్ సీపీ(ట్రాఫిక్), హైదరాబాద్
ఎస్.ఎం.విజయ్ కుమార్ – వెస్ట్ జోన్ DCP, హైదరాబాద్
జోయల్ డేవిస్ – స్పెషల్ బ్రాంచ్ DCP, హైదరాబాద్
రోహిణి ప్రియదర్శిని – నార్త్ జోన్ DCP, హైదరాబాద్
ఎ.వి.రంగనాథ్ – సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీ, హైదరాబాద్
ఎన్.శ్వేత – సీసీఎస్ DCP, హైదరాబాద్
ఎస్.సుబ్బారాయుడు – DCP(ట్రాఫిక్-1), హైదరాబాద్
నితిక పంత్ – అటాచ్డ్ DGP ఆఫీస్
గజరావ్ భూపాల్ – అటాచ్డ్ DGP ఆఫీస్
చందన దీప్తి – అటాచ్డ్ DGP ఆఫీస్