Published 21 Dec 2023
జట్టులో చోటే ప్రశ్నార్థకమైన వేళ.. ఎన్నిసార్లు ఛాన్సులు ఇచ్చినా రాణించట్లేదని విమర్శలున్న పరిస్థితుల్లో సంజూ శాంసన్ ఎట్టకేలకు తన టాలెంట్ ను ప్రదర్శించారు. ఎనిమిదేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్ లో కేవలం 16వ వన్డే ఆడుతున్న ఈ కేరళ ప్లేయర్.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికాలోని పార్ల్ లో జరుగుతున్న మూడో వన్డేలో శాంసన్(108; 114 బంతుల్లో 6×4, 3×6) నిలకడగా ఆడటంతో భారత జట్టు మంచి స్కోరు చేసింది. 49కే రెండు వికెట్లు పడ్డ టీమ్ ను గట్టెక్కిస్తూ కెరీర్ లో ఫస్ట్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.
కెప్టెన్ రాహుల్ తొందరగానే ఔటైనా ఎడమ చేతి వాటం తిలక్ వర్మ(52; 77 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి సంజూ ముందుండి నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ అవకాశం దొరికితే సిక్సులు బాదుతూ తనకు గొప్పగా నిలిచే ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. చివర్లో రింకూ సింగ్ బ్యాట్ కు పనిచెప్పడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది.