జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ నాలుగేళ్లలో 3,366 కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతి విద్యార్థికి రూ.2,400 విలువైన కిట్ ఇస్తున్నామని, 6 ఆ పై తరగతుల్లో డిజిటల్ బోధనకు శ్రీకారం చుడుతున్నామన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని బహిరంగసభలో ప్రసంగించారు. చంద్రబాబు జీవితమే పెద్ద మోసమని.. పెత్తందారీ మనస్తత్వం, పేదలకు వ్యతిరేకం బాబు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాలుగేళ్లలో విద్యారంగంపై రూ.60,329 కోట్లు కేటాయించామన్నారు. ఏపీలో జరుగుతున్నది కురుక్షేత్ర మహాసంగ్రామమని.. ప్రజల ఆశీస్సులే తనను కాపాడతాయని అన్నారు. డిసెంబరు 21న విద్యార్థులకు మరోసారి ట్యాబ్ లు పంపిణీ చేస్తామన్నారు.