
తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వచ్చిన భక్తులు శుక్రవారం సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలోని అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్నారు. వీరందరికీ 24 గంటల్లో దర్శనం లభించనుందని అధికారులు చెబుతున్నారు. విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న దృష్ట్యా భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.