
వలంటీర్లపై అభ్యంతరకర కామెంట్లు చేశారంటూ పవన్ కల్యాణ్ పై ఎంక్వయిరీ(enquiry)కి జగన్ సర్కారు ఆదేశాలిచ్చేనా.. తగ్గేదేలే అంటున్నారు జనసేనాని. పైగా అదే వలంటీర్లపై మరోసారి ఘాటు కామెంట్లు చేశారు. 23 అంశాలపై సమాచారం సేకరించి వారంతా దాన్ని ఎక్కడికి పంపుతున్నారని ప్రశ్నించారు. సమాచార సేకరణ అనేది చౌర్యం కిందకు వస్తుందని, వలంటీర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నారని పవన్ అన్నారు. ఈ వ్యవస్థ తీరుపై అమిత్ షాతో మాట్లాడానన్నారు. వలంటీర్లు చేసే పనులు కోర్టులు కూడా చూస్తున్నాయని వార్నింగ్(warning) ఇచ్చారు.
‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. అందుకోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం.. వలంటీర్లకు ఉపాధి హామీ కూలీల కన్నా తక్కువగా రోజుకు కేవలం రూ.164 ఇస్తున్నారు’ అని పవన్ అన్నారు. జులై 9న మాట్లాడిన మాటలపై పవన్ ను విచారించేందుకు AP సర్కారు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. వలంటీర్లపై చేసిన కామెంట్లకు గాను ఆయనపై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయడంతోపాటు సంబంధిత కోర్టుల్లో వ్యక్తిగతంగా పరువు నష్టం దాఖలు చేయాల్సిందిగా సూచించింది. దీనిపై ఘాటుగా స్పందించిన జనసేనాని.. దేనికీ భయపడబోనని స్పష్టం చేశారు.