
పల్నాడు జిల్లా వినుకొండలో ఇరువర్గాల ఘర్షణ మరువకముందే మరో వివాదం మొదలైంది. బాపట్ల జిల్లా అద్దంకిలోనూ అదే తరహా వాతావరణం కనిపించింది. YSRCP, TDP మరోసారి కయ్యానికి కాలు దువ్వాయి. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు అద్దంకి పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. భవానీ శంకర్ ఏరియాలో ఫ్లెక్సీలు కడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారితో కార్యకర్తలు గొడవకు దిగడంతోపాటు రోడ్డుపై బైఠాయించారు. MLA గొట్టిపాటి రవికుమార్ ఫ్లెక్సీల్ని TDP కార్యకర్తలు కడుతుండగా.. YCP కార్యకర్తలు అడ్డుకున్నారు. మా ఫ్లెక్సీలు కనపడకుండా చేస్తున్నారంటూ YCP గొడవకు దిగడంతో రెండు పార్టీల మధ్య పరస్పర ఘర్షణకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో రెండు వర్గాల్ని పోలీసులు చెదరగొట్టారు.
మూడు రోజుల క్రితం పల్నాడు జిల్లా వినుకొండలోనూ రెండు పార్టీలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఉద్రిక్త వాతావరణంలో పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది.