
మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యులకు ప్రభుత్వాలు భారీ నజరానాలు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వాసి నల్లపురెడ్డి శ్రీచరణి(Sri Charani)కి గ్రూప్ -1 ఉద్యోగంతోపాటు రూ.2.5 కోట్ల నగదు పురస్కారం, కడపలో ఇంటి స్థలాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ క్రికెటర్ మిథాలిరాజ్ తో కలిసి శ్రీచరణి.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ను కలిశారు. వరల్డ్ కప్ లో 9 మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచారు.