ఆంధ్రప్రదేశ్(AP)లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో విజయం ఎవరిదన్న దానిపై ఆయా పార్టీల్లో అంతర్గతం(Internal)గా ఉత్కంఠ నెలకొన్న వేళ మరో సర్వే బయటకు వచ్చింది. NDA-YSRCP మధ్య హోరాహోరీ పోరు తప్పదని అయితే ఇందులో కూటమిదే పైచేయి అని తేల్చిందా సర్వే. YCP 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసింది.
కూటమిలో భాగంగా TDP 144 అసెంబ్లీ, 17 లోక్ సభ సీట్లకు.. BJP 10 అసెంబ్లీ, 6 లోక్ సభ.. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీకి దిగాయి. దీనిపై ‘యాక్సిస్ మై ఇండియా’ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ను తాజాగా బయటపెట్టింది.
సీట్లు ఇలా…
(NDA… 98-120.. TDP+BJP+Janasena)
TDP… 78-96
YCP… 55-77
Janasena 16-18
BJP 4-6
Congress 0-2