బెయిల్ మంజూరు కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్ తోపాటు చంద్రబాబును మరోసారి కస్టడీ కోరుతూ CID వేసిన పిటిషన్ పైనా విచారణ జరగనుంది. ACB కోర్టు న్యాయమూర్తి నిన్న సెలవుపై వెళ్లడంతో ఇంఛార్జి జడ్జి ఎదుట వాదనలు కొనసాగుతాయని భావించారు. దీంతో ఈ కేసులో వాదనలు రేపటికి వాయిదా వేస్తున్నామని ఇంఛార్జి న్యాయమూర్తి స్పష్టం చేశారు. కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.