మాజీ ఎంపీ YS వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు చుక్కెదురైంది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ పెట్టుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అటు భాస్కర్ రెడ్డితోపాటు మరో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్ ను సైతం తిరస్కరించింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులు(Main Accused)గా ఉన్నవారికి బెయిల్ ఇస్తే ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశం ఉందని, వారు కేసును ప్రభావితం(Influence) చేసే ప్రమాదం ఉందని గతంలోనే కోర్టుకు CBI తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదంటూ విన్నవించింది. ఇలాంటి పరిస్థితుల్లో భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.