చంద్రబాబును జైలులో పెట్టడం ద్వారా CM జగన్ తన కోరిక తీర్చుకున్నారని నందమూరి బాలకృష్ణ విమర్శించారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు కాబట్టి బాబును కనీసం 16 రోజులైనా కటకటాల వెనక్కు పంపాలన్న కసితోనే అలా చేశారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ముఖ్యమంత్రి కేవలం నిర్ణయం మాత్రమే తీసుకుంటారని, దాన్ని అమలు చేసేది యంత్రాంగమేనని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలకు పాల్పడ్డా తమను, తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని బాలకృష్ణ మండిపడ్డారు.
అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, మొరిగితే పట్టించుకోవడం అతిక్రమిస్తే ఉపేక్షించే పరిస్థితే లేదని గుర్తు చేశారు. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరినీ కలుస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు.