చంద్రబాబు అరెస్టులో BJP హస్తం ఉందో లేదో తెలియదని.. అనవసరంగా ఎవరిపై నిందలు వేయదలచుకోలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. అయితే కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన తన అక్క పురందేశ్వరితో టచ్ లోనే ఉన్నామని, బాబు అరెస్టుపై కేంద్రాన్ని కలుస్తామని తెలిపారు. జూనియర్ NTR ఈ విషయంపై స్పందించకపోవడాన్ని ఆయన లైట్ గా తీసుకున్నట్లు మాట్లాడారు. ‘NTR మాట్లాడకపోతే డోంట్ కేర్’ అన్నారు. ‘త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి.. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో జోష్ వస్తున్నది.. ఇంతకాలం TDP అజ్ఞాతంలో ఉంది, ఇప్పుడు మళ్లీ చైతన్యం వస్తోంది.. తెలంగాణలో TDP జెండా రెపరెపలాడుతుంది’ అని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
రోజా కామెంట్స్ పైనా స్పందించాలా…
మంత్రి రోజా కామెంట్స్ కు పెద్దగా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదన్నారు బాలకృష్ణ. రోజా లాంటి వాళ్ల స్పందనపై మౌనంగా ఉండటమే మేలు, బురద మీద రాయి వేస్తే అది మన మీదే వచ్చి పడుతుందని కామెంట్ చేశారు. APలో సైకో పాలన నడుస్తుందన్న ఆయన.. కల్పించుకోవాల్సిన టైమ్ లో కేంద్రం స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.