తెలంగాణ విద్యా వ్యవస్థ(Education system)పై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన రీతిలో కామెంట్లు చేశారు. పూర్తి పారదర్శకంగా సాగుతున్న ఏపీ సిస్టమ్ తో తెలంగాణను పోల్చడం ఏ మాత్రం పొంతన లేనిదని బొత్స అన్నారు. ఏపీ విద్యా విధానం తెలంగాణ కంటే ఎంతో మెరుగైనదన్న ఆయన… ‘ఎవరి విధానం వారిది, ఎవరి ఆలోచన వారిది… ఎవరి లైన్ వారిది… అలాంటి వారితో మమ్మల్ని ఎలా పోలుస్తారు’ అంటూ మాట్లాడారు. తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏదీ సరిగా కనిపించిన దాఖలాలు లేవు. ఆ రాష్ట్ర సర్వీస్ కమిషన్ లో ఎటుచూసినా చూచిరాతలు, కుంభకోణాలు(Scams), పేపర్ లీకేజీలే ఉన్నాయి… ఈ స్కామ్ ల్లో ఎంతమంది అరెస్టవుతున్నారు, ఎంత మంది ఇన్వాల్వ్ అవుతున్నారో రోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం.. ఇంతకంటే ఉదాహరణలు ఏముంటాయి’ అని బొత్స అన్నారు.
‘ట్రాన్స్ ఫర్స్ కే దిక్కు లేదక్కడ’…
‘వాళ్ల ఉపాధ్యాయుల్ని వాళ్లు ట్రాన్స్ ఫర్స్ కూడా చేసుకోలేని దయనీయ, దురవస్థ గల వాతావరణం అక్కడ ఉంది… అందువల్ల ఒక రాష్ట్రంతో మరో రాష్ట్రాన్ని ఎలా పోలుస్తారు అంటూ ఎద్దేవా చేశారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ, విడిపోయినప్పుడు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో APనే ఫస్ట్ అని… దేశంలో ఇప్పుడందరూ ఏపీ వైపే చూస్తున్నారన్నారు’. గత కొద్ది కాలం క్రితం తెలంగాణ మంత్రులు.. ఏపీలోని విద్యుత్తు, భూములు, పరిశ్రమల సిస్టమ్స్ తీరుపై ఉదాసీనంగా మాట్లాడారు. అక్కడ భూములకు విలువనే లేదని స్వయంగా KCR అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ విద్యారంగం తీరుపై బొత్స సంచలన రీతిలో మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Antha seen ledu meeku…