
ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం తొలి సంతకం మెగా DSCపై పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మొత్తం 16,347 పోస్టులతో కూడిన రిక్రూట్మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన(Notification)ను సవరించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు.
పోస్టులు ఇలా…
| పోస్టుల కేటగిరీ | సంఖ్య |
| స్కూల్ అసిస్టెంట్లు | 7,725 |
| సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) | 6,371 |
| టీజీటీ | 1,781 |
| పీజీటీ | 286 |
| ప్రిన్సిపల్స్ | 52 |
| పీఈటీ | 132 |