మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు ACB కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించగా.. పోటాపోటీ వాదనలు కొనసాగాయి. బాబును నిన్న నంద్యాలలో అరెస్టు చేసిన CID పోలీసులు.. శనివారం నాడు 9 గంటల పాటు విచారణ చేపట్టారు. CID ఆఫీసులో జరిగిన విచారణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, TDP కార్యకర్తలు, నాయకులు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. స్కిల్ స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబును చూసేందుకు భారీయెత్తున పార్టీ శ్రేణులు అక్కడకు వచ్చాయి. సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా బాబు తరఫున వాదనలు వినిపించేందుకు నిన్ననే స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు రిలీజయ్యాయని, ఆయన పేరు FIRలో లేకపోవడంతో ఆయన్ను ముద్దాయిగా చేర్చాలని CID మెమో దాఖలు చేసింది. స్కిల్ స్కామ్ లో ఈ మాజీ CM A1గా ఉన్నారు. ఇక ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, CID తరఫున ఇద్దరు లాయర్లు వెంకటాచారి, వెంకటేశ్ వాదనలు వినిపించారు.
పవన్ ను అడ్డుకున్న పోలీసులు
విజయవాడకు బయల్దేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కారులో ఆయన వెళ్తుండగా AP బార్డర్ లో నిలిపివేసి ముందుకు వెళ్లనీయలేదు. దీంతో పవన్ కల్యాణ్ రోడ్డు మీదే పడుకుని నిరసన తెలిపారు.