ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 ఈరోజు రాత్రికి చంద్రుడి కక్ష్యలోకి చేరుకోనుంది. 18 రోజుల కాలంలో 5 సార్లు కక్ష్యను పెంచిన శాస్త్రవేత్తలు.. ఆగస్టు 1న అర్థరాత్రి రాకెట్ ను భూకక్ష్య నుంచి చంద్రుని వైపు మళ్లించారు. ఈ జులై 14న తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు.
ఈ ప్రొపల్షన్ మాడ్యుల్ భూమి చుట్టూ 20 రోజులకు పైగా చుట్టివచ్చింది. ఇంచుమించు 3,84,000 కిలోమీటర్లు ప్రయాణించే చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం మొత్తం రూ.613 కోట్లను ఇస్రో వెచ్చించింది. ఆగస్టు 23న సాయంత్రం ఈ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.