విజయవాడ భవానీపురంలో బాలుడు కిడ్నాప్ కాగా.. గంటల వ్యవధిలోనే పోలీసులు కథ సుఖాంతం చేశారు. దుండగుల్ని అదుపులోకి తీసుకుని బాలుణ్ని తల్లిదండ్రులకు అప్పగించారు. తన కొడుకును నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ భవానీపురానికి చెందిన మహిళ కంప్లయింట్ ఇచ్చారు. నాలుగు టీమ్ లుగా ఏర్పడ్డ పోలీసులు విస్తృతంగా గాలింపు చేట్టారు. చివరకు కృష్ణా జిల్లా తుమ్మలపాలెం గ్రామ సమీపంలో బాలుడిని గుర్తించారు.

సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నట్లు విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ తెలిపారు. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి, మరో ఇద్దరు మహిళలు ఈ కిడ్నాప్ లో పాల్గొన్నారన్నారు. బాలుడి తండ్రికి, కిడ్నాపర్లకు లావాదేవీలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.