
టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్ CM వద్ద ఉందని రాజాంలో జరిగిన ప్రోగ్రాంలో అన్నారు. రాష్ట్రంలోని వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వారి మనోభావాలు దెబ్బతీయొద్దని, బ్యాడ్ వర్డ్స్ ఉపయోగించకూడదని హితవు పలికారు.
రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, గవర్నమెంట్ బిల్డింగ్ ల నిర్మాణాల్లో స్పీడ్ పెంచాలన్న బొత్స… వాటిని పూర్తి చేసి వెంటనే అప్పగించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కన్ స్ట్రక్షన్ కంప్లీట్ చేసిన వాటికి బిల్లులు చెల్లిస్తామన్నారు.