
హైదరాబాద్, గుంటూరులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) విస్తృత రీతిలో దాడులు నిర్వహిస్తోంది. మొత్తం 15 టీమ్ లు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్ లో మలినేని సాంబశివరావు, గుంటూరులో రాయపాటి సాంబశివరావు ఇంట్లో భారీయెత్తున సోదాలు జరుగుతున్నాయి. పలు కంపెనీల్లో భాగస్వామ్యం(Partnership)తోపాటు ఆ సంస్థలతో రాయపాటి సాంబశివరావుతోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధాలున్నాయన్న కోణంలో సంబంధిత సంస్థలన్నింటిలో భారీయెత్తున సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో మూడు ప్రాంతాల్లో భద్రత నడుమ ED బృందాలు ఫైల్స్ పరిశీలిస్తున్నాయి.
2004లో ఐదు బ్యాంకుల నుంచి సదరు కంపెనీ పేరు మీద లోన్లు తీసుకుని వాటిని ఎగ్గొట్టారన్న కోణంలో ED అధికారుల రైడ్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
రూ.వేల కోట్లలో రుణాలు
రూ.10,598 కోట్ల లోన్ తీసుకోగా వడ్డీతో కలిపి రూ.36,598 కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే అంతకుముందే ఆ కంపెనీలో అవకతవకలు బయటపడ్డాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీకి డైరెక్టర్లుగా మలినేని, రాయపాటి డైరెక్టర్లుగా వ్యవహరించారు.