గత బడ్జెట్లలో పూర్తి నిరాశను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్.. ఈసారి మాత్రం ఆశాజనక ఫలితాలు అందుకుంటున్నది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం APని అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.15,000 కోట్లను మంత్రి ప్రకటించారు. వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి ఈ నిధుల్ని సేకరించనున్నట్లు తెలిపారు. పోలవరం(Polavaram) ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తామని.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం వంటి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెడతామన్నారు.