ఏపీపీఎస్సీ గ్రూప్-1 తుది ఫలితాలు రిలీజ్ అయ్యాయి. తొలి మూడు ర్యాంకుల్ని అమ్మాయిలే చేజిక్కించుకున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల(Candidates) జాబితా(List)ను ఏపీపీఎస్సీ వెల్లడించింది. మహిళా అభ్యర్థుల్లో భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ఫస్ట్ ర్యాంక్ సాధించారు. భూమిరెడ్డి పావనికి రెండో ర్యాంకు… కంబాలకుంట లక్ష్మీప్రసన్న అనే అభ్యర్థి మూడో ర్యాంకును కైవసం చేసుకున్నట్లు APPSC ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు.
మహిళా అభ్యర్థులకే ఎక్కువ ర్యాంకులు వచ్చాయన్నారు. నాలుగో ర్యాంకును ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఐదో ర్యాంకును భానుప్రకాశ్ రెడ్డి దక్కించుకున్నారు. మొత్తం 16 కేటగిరీల్లో 110 పోస్టులకు అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు.