స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ అనుభవిస్తున్న చంద్రబాబుకు బెయిల్ ఇప్పించడంలో ఆయన తరఫు లాయర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ACB కోర్టులో వేసిన పిటిషన్ పై ఈ రోజు వాదనలు కొనసాగుతున్నాయి. బాబుకు అక్టోబరు 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమ కస్టడీకి తీసుకున్న CID… ఈ మాజీ సీఎంను రెండు రోజుల పాటు విచారణ జరిపింది. ఈ స్కాంలో తన తప్పు లేదంటూ చంద్రబాబు.. ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వీగిపోవడంతో ఇప్పుడు ACB కోర్టు ఇచ్చే ఆదేశాలపైనే బాబు భవితవ్యం ఆధారపడి ఉంది.