తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. తిరుపతి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు(Pilgrims) ఇబ్బందులు పడుతున్నారు. గోగర్భం, పాపవినాశనం జలాశయాలు(Dams) పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో అటువైపు వెళ్లే దారుల్ని మూసివేశారు. శ్రీవారి పాదాలు, కపిల తీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తుల్ని ఆపివేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో TTD అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తిరుపతిలో మాల్వాడిగుండం జలపాతం పొంగిపొర్లడంతో సమీప ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు చోట్ల వాహనాల రాకపోకల్ని దారిమళ్లిస్తున్నారు. తిరుమలపై వర్షంతో ఇబ్బందులు పడుతున్న భక్తులకు పెరిగిన చలి సైతం సమస్యలు తెచ్చింది. ఘాట్ రోడ్డులో వెహికిల్స్ జాగ్రత్తగా వెళ్లేలా TTD హెచ్చరికలు జారీచేసింది. తిరుపతి పట్టణంలోని చాలా కాలనీలు వరదలో చిక్కుకున్నాయి.