తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భారీస్థాయిలో జనం కొండకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండే క్యూలైన్లు నిండిపోయాయి. కృష్ణతేజ అతిథిగృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 87,171 మంది దర్శించుకోగా.. 38,273 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం శుక్రవారం నాడు రూ.3.68 కోట్లుగా ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.