భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోతోంది. క్యూకాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ శుక్రవారం నిండిపోయాయి. వీకెండ్ హాలిడేస్ ప్రభావం వల్ల శుక్ర, శని, ఆదివారాల్లో భారీగా భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. సమ్మర్ హాలిడేస్ ముగిసిన తర్వాత తిరుమలకు ఒక్కసారిగా భక్తుల రాక తగ్గింది. కానీ వారాంతంలో మాత్రం ఎప్పుడూ రద్దీ కనిపిస్తోంది. రూమ్ లు దొరక్క భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గురువారం స్వామివారిని 66,977 మంది దర్శించుకోగా… రూ.4.39 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.