
తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 18 గంటలు పడుతున్నది. 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామి వారిని 81,472 మంది దర్శించుకోగా.. 34,820 మంది తలనీలాలు సమర్పించారు. శనివారం తిరుమల హుండీ ఆదాయం రూ.3.90 కోట్లుగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వర్గాలు తెలిపాయి.