తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఏడు కొండల వాడి చెంతన సందడి కనిపిస్తున్నది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. శ్రీవారి సర్వ దర్శనానికి 29 కంపార్ట్ మెంటలో భక్తులు వేచి ఉన్నారు. వారాంతం కావడంతో శుక్రవారం సాయంత్రానికే భారీ సంఖ్యలో కొండ పైకి చేరుకున్నారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు భక్తుల రాక మరింత పెరగవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వర్గాలు అంటున్నాయి.
నిన్న(శుక్రవారం) శ్రీవారిని 69,270 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో 28,755 మంది తలనీలాలు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా ఉందని తెలిపారు.