తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ(Rush) కొనసాగుతున్నది. టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. స్వామి వారి సర్వ దర్శనం కోసం 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. బుధవారం నాడు శ్రీవారిని 75,776 మంది దర్శించుకున్నారు. ఇందులో 22,700 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారికి 4.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు తితిదే(TTD) వర్గాలు తెలిపాయి.