Published 04 Jan 2024
మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే సందర్భంలో ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది ఢిల్లీలోని AICC సెంట్రల్ ఆఫీస్. క్రైస్తవ మత ప్రబోధకుడిగా పనిచేస్తున్న బ్రదర్ అనిల్ కు.. హస్తం పార్టీ కండువా వేయడంపై మల్లికార్జున ఖర్గేకే వింత అనుభవం ఎదురైంది. చిరునవ్వుతోనే దాన్ని నిరాకరించినట్లుగా అనిల్ వ్యవహరించడం.. ఆమె, మీరు ఒకటే కదా అన్నట్లుగా ఖర్గే హావభావాలు కనిపించడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న షర్మిల… గత రెండు నెలలుగా ఆ పార్టీతో సన్నిహత సంబంధాలు నడిపిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రోజుల క్రితం ఢిల్లీ నుంచి అందిన మెసేజ్ మేరకు… పార్టీ విలీనంపై గ్రీన్ సిగ్నల్ ను స్వయంగా షర్మిలనే ఇచ్చారు.
భర్తతో కలిసి ఢిల్లీకి…
YSRTPని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు గాను భర్త అనిల్ తో కలిసి షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. AICC ప్రధాన కార్యాలయంలో షర్మిలకు కండువా కప్పిన ఖర్గే… మరో కండువాను చేతుల్లోకి తీసుకున్నారు. ఆ రెండో కండువాను ఆమె భర్త కోసం తెప్పించగా.. షర్మిల వెనకే నిల్చున్న అనిల్ కు కప్పేందుకన్నట్లు ఖర్గే రెడీ అయ్యారు. ఈ విషయాన్ని గమనించిన షర్మిల చిరునవ్వుతోనే భర్త వైపు చూస్తుండగా.. అనిల్ మాత్రం గట్టిగా నవ్వి తాను మత ప్రబోధకుడినన్న విషయాన్ని కళ్లతోనే గుర్తు చేశారు. దీంతో ‘మీరిద్దరూ ఒకటే కదా’ అన్న రీతిలో చేతి సంజ్ఞలతో ఖర్గే హావాభావాలు కనిపించడం ఇంట్రెస్టింగ్ పరిణామానికి దారితీశాయి. పార్టీ విలీనం తర్వాత మాట్లాడిన షర్మిల.. రాహుల్ ను ప్రధానిగా చూడాలన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వప్నం అని అన్నారు.