
రాజధాని భూముల స్కామ్, స్కిల్ స్కామ్(Skill Development), లిక్కర్ స్కామ్(Liquor Scam).. ఇలా చంద్రబాబు పాలనంతా స్కాములే తప్ప స్కీములు కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాన్ని నిలువునా దోచుకునేందుకే చంద్రబాబుకు అధికారం కావాలంటూ పుట్టపర్తి సభలో మాట్లాడారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని CM అందించారు. 53.53 లక్షల కర్షకులకు రూ.2204.77 కోట్ల సాయాన్ని బటన్ నొక్కి అకౌంట్లలో వేశారు.
వరుసగా ఐదో సంవత్సరం రైతుల పెట్టుబడి అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో ఒక్కటన్నా మంచి స్కీమ్ పెట్టారా అని ప్రశ్నించిన జగన్.. ఆయన పాలన మొత్తం అవినీతితో నిండిపోయిందన్నారు.