వివాహ వ్యవస్థను విశ్వసించని పవన్ కల్యాణ్ నాలుగేళ్లకో పెళ్లి చేసుకుని ఎలాంటి సంకేతాలిస్తున్నారో అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సతీమణులతో కలిసి ఉండకున్నా చంద్రబాబుతో మాత్రం 15 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారని విమర్శించారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.4,275 కోట్లు విడుదల చేసిన సందర్భంగా భీమవరంలో ఆయన మాట్లాడారు. వివాహ వ్యవస్థను నాశనం చేసిన పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండి చక్రం తిప్పితే ఆడబిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు.
‘నాలుగేళ్లకోసారి పెళ్లి, ఆ తర్వాత విడాకులు.. ఇలాంటి వాళ్లు సీఎం అయితే అంతకన్నా ఏముంటుంది.. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే త్యాగారాజు ఆయన.. వేరొకరిని ముఖ్యమంత్రి చేయడానికి 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్న వ్యక్తి’ అంటూ విమర్శలు చేశారు.