రానున్న ఎన్నికల కోసం(Upcoming Elections) జనసేన పార్టీ రెడీ అవుతున్నది. వచ్చే ఎన్నికల్లో కూటమికి అధికారం దక్కేందుకు కావాల్సిన వనరులు, స్థితిగతులపై అధినేత పవన్ కల్యాణ్.. పార్టీ లీడర్లతో వరుస సమావేశాలు(Regular Meetings) నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం, BJPతో కలిసి ఈసారి మెజార్టీ సీట్లు సాధిస్తామన్న భావనలో ఉన్న జనసేన.. విశాఖపట్నం జిల్లాలో గెలుపునకు పెద్దయెత్తున అవకాశాలున్నాయన్న అభిప్రాయంతో ఉంది.
కీలకంగా విశాఖ జిల్లా…
దీంతో విశాఖ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగాలని పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి తన సోదరుడు నాగబాబును రంగంలోకి దింపాలని ఆ పార్టీ చీఫ్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగబోయే అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు, సామాజిక సమీకరణాల(Community Equations)పై దృష్టి పెట్టిన అధిష్ఠానం.. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలన్నదానిపై కసరత్తు మొదలుపెట్టింది. టికెట్లు ప్రకటించేవరకు నియోజకవర్గం వారీగా సమన్వయకర్తల్ని(Co-Ordinators) నియమించిది.
గందరగోళానికి చెక్…
ఇప్పటికే టికెట్ల విషయంలో రెండు పార్టీల మధ్య గందరగోళం ఏర్పడింది. తమకు తెలియకుండానే పొత్తు ధర్మాన్ని మరచి అభ్యర్థుల్ని ప్రకటించారంటూ TDPపై పవనే డైరెక్ట్ గా విమర్శలు చేశారు. పోటాపోటీగా తాను కూడా ఇద్దరు అభ్యర్థులు ప్రకటించడంతో రెండు పార్టీల్లో అయోమయం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయన్నది చూడాల్సి ఉంది. అయితే పవన్ ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాతే సీట్ల ప్రకటన ఉండనున్నట్లు సమాచారం.
కోఆర్డినేటర్లు వీరే…
గాజువాక – సుందరపు సతీశ్
భీమిలి – వంశీకృష్ణ శ్రీనివాస్
పెందుర్తి – పంచకర్ల రమేశ్
యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
విశాఖ సౌత్ – సాదిక్
పాయకరావుపేట – శివకుమారి(మాజీ ఎమ్మెల్సీ)