గతంలో హిందీని వ్యతిరేకించి ఇప్పుడు సమర్థిస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్ని జనసేనాధిపతి పవన్ కల్యాణ్ కొట్టిపడేశారు. హిందీని తానెప్పుడూ వద్దనలేదని, కానీ బలవంతంగా దాన్ని రుద్దడాన్నే తప్పుబట్టానని గుర్తు చేశారు. తమిళనాడు సర్కారు తీరును నిన్న జనసేన సభలో ఎండగట్టడంతో.. DMK నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. గతంలో హిందీ వద్దన్న పవన్, ఇప్పుడు కావాలనడం BJP నుంచి ఏదో కోరుకోవడానికేనంటూ కనిమొళి సహా ఆ పార్టీ నేతలు విమర్శించారు. హిందీ కంపల్సరీ అని NEP-2020 చెప్పలేదన్న పవన్.. కొందరు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జవాబిచ్చారు.