ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన(Sensational) నేత(Leader)గా మారిన పవన్ కల్యాణ్… ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కీలకంగా మారారు. 100% స్ట్రైక్ రేట్ తో జనసేనాని సాగించిన విజయదుందుభి.. చిరకాలం గుర్తుండిపోతుంది. అలాంటి పవన్ కు ఏ పదవి ఇస్తే బాగుంటుందన్న చర్చ ఇప్పటికే జనాల్లో జోరుగా నడుస్తున్నది. ఉప ముఖ్యమంత్రి(Deputy CM) అయితేనే కరెక్ట్ అన్న మాటలు వినపడుతున్నాయి.
దానికి సై…
డిప్యూటీ సీఎం పదవికి పవన్ ఓకే అని ఇండియా టుడే ఛానల్ ప్రసారం చేసింది. కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన జనసేన చీఫ్.. అక్కడే సదరు ఛానల్ తో మాట్లాడారు. తనకు డిప్యూటీ CM పదవి పట్ల ఆసక్తి ఉన్నట్లు ఇండియా టుడే బ్రేకింగ్ వేసింది. దీంతో ఇది కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ రెడీ అని ఆయన అభిమానులు సైతం అనుకుంటున్నారు.