వరుస ప్రయోగాలతో సత్తా చాటుతోన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) తాజాగా ఏడు ఉపగ్రహాలను సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV-C 56 ద్వారా చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో తెలిపింది. నాలుగు దశల్లో రాకెట్ ప్రయోగాన్ని చేపట్టగా.. మొత్తం ఏడు శాటిలైట్స్(Satellites)ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇందులో సింగపూర్ కు చెందిన 420 కిలోల వెయిట్ గల 7 ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. సెప్టెంబరులో మరో PSLV ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారు. పూర్తి కమర్షియల్ పద్ధతిలో చేస్తామని, ఈ సంవత్సరం కంటిన్యూ ఎక్స్ పెరిమెంట్స్ తో బిజిగా ఉంటామన్నారు.
ప్రస్తుతానికి నాలుగు భారీ ప్రాజెక్టులు ఆదిత్య, గగన్ యాన్, SSLV, GSLV ఇస్రో చేతిలో ఉన్నాయి. చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలోకి పంపి మరోసారి ఘనత చాటిచెప్పిన ఇస్రో.. ఇలా వరుస ప్రయోగాలతో బిజీ బిజీగా ఉంది. సింగపూర్ తమపై నమ్మకం ఉంచినందుకు శాస్త్రవేత్తలు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో కమర్షియల్ శాటిలైట్ కావడం విశేషం.