Published 28 Jan 2024
రాజకీయాలు(Politics) వేరు… వ్యాపారం(Business) వేరు… ఈ రెండు రంగాల్లో ఇమడాలంటే కష్టమైన పనే. వ్యాపారంలో బాగా సంపాదించినవాళ్లు పాలిటిక్స్ లోకి ఎంటరై మంచి పేరు సంపాదించినవాళ్లు ఉన్నారు. అటు రాజకీయాల్లో ఉన్నతస్థాయికి చేరుకుని వ్యాపారాలు ప్రారంభించినవాళ్లూ కనిపిస్తారు. అయితే ఒక భారీ సంస్థకు యజమాని(Proprietor) అయి ఉండి వేల కోట్ల వ్యాపారం నిర్వహిస్తూ రాజకీయాల్లోనూ చురుగ్గా పనిచేస్తున్న వ్యక్తి… అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు ఇక అవసరం లేదంటూ ఒక్కసారిగా ప్రకటించారు. అలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా జయదేవ్.
అమరరాజా బ్యాటరీస్…
చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా జయదేవ్.. అమరరాజా కంపెనీలకు అధిపతి(MD)గా ఉన్నారు. ఆయన తల్లి గల్లా అరుణకుమారి గతంలో చంద్రగిరి నుంచి MLAగా గెలిచి ఉమ్మడి(United) ఆంధ్రప్రదేశ్ లో పలుసార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఈయన TDP ఎంపీగా, ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా వ్యవహరిస్తున్నారు. జయదేవ్ తండ్రి రామచంద్రనాయుడు స్థాపించిన కంపెనీని దశదశలు(Phases Wise)గా విస్తరించారు జయదేవ్. సినీ సూపర్ స్టార్ దివంగత కృష్ణ కూతురు పద్మావతిని వివాహం చేసుకున్న జయదేవ్.. 2014 ఎన్నికల్లోనే రూ.683 కోట్ల ఆస్తులను చూపించారు.
జగన్ సర్కారుతో…
TDPలో చురుగ్గా ఉన్న జయదేవ్.. APలో కంపెనీని విస్తరించా(Expansion)లని ప్రయత్నించారు. కానీ రాజకీయంగా జగన్ కు ఇబ్బందికరంగా మారిన ఈయన.. తన కంపెనీ విస్తరణను ఏపీలో రద్దు చేసుకుని హైదరాబాద్ లో స్టార్ట్ చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి KCR సర్కారుతో మంతనాలు జరిపారు. ఇలాంటి జయదేవ్ ఉన్నట్టుండి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఆశ్చర్యకరంగా మారింది.