తిరుమల(Thirumala) ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కలకలం రేపింది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద బుధవారం సాయంత్రం చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని గుంపులు గుంపులుగా జనాల్ని పంపిస్తున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన కౌశిక్(4) అనే బాలుణ్ని నోట కరచుకుని చిరుత అడవిలోకి తీసుకుపోయింది. అందరూ గట్టిగా అరవడం, రాళ్లు విసరడంతో భయపడి పోలీసు ఔట్ పోస్టు వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఆ తర్వాత ఫారెస్ట్ సిబ్బంది చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయినా మళ్లీ చిరుత ఘాట్ రోడ్డు(Ghar Road)లో కనిపించడంతో భక్తుల్లో మళ్లీ భయం మొదలైంది.