తిరుమల కాలినడక దారిలో విషాదం నెలకొంది. చిరుత దాడి చేయడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్న కొద్దిసేపటికే అక్కడ చిరుత దాడికి పాల్పడింది. లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాడుకు చెందిన కుటుంబం దైవ దర్శనానికి కోసం రాగా.. శుక్రవారం రాత్రి ఎనిమిదింటింకి కాలినడకన ఆ చిన్నారి ఫ్యామిలీ తిరుమలకు బయల్దేరింది. పాపను చిరుత లాక్కెళ్లడంతో ఆమె తల్లిదండ్రులు సెక్యూరిటీ సిబ్బందికి కంప్లయింట్ ఇచ్చారు.
మొన్నటి జూన్ లో కూడా బాలుణ్ని చిరుత నోటకరుచుకుని వెళ్లింది. అక్కడున్న వారి అరుపులతో చిన్నారిని అడవిలో వదిలిపెట్టింది. ఆ బాలుడికి తీవ్ర గాయాలైనా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఇప్పుడు ఈ బాలిక మాత్రం చిరుత దాడికి బలైంది.