
తిరుమల కాలి నడక(Walk Way) మార్గంలో భక్తులను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులులు ఒక్కటొక్కటే పట్టుబడుతున్నాయి. ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. దీంతో గత 50 రోజుల కాలంలో మొత్తం 5 క్రూరమృగాలు బోన్లలో చిక్కుకున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలికను పొట్టనబెట్టుకున్న వన్యమృగాల కోసం.. ఫారెస్టు డిపార్ట్ మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. నడక దారిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుతలు తిరుగుతున్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే.
500 కెమెరాలు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేయడంతో క్రమంగా ఒక్కో చిరుత అందులో చిక్కుకుంటోంది. ఈరోజు పట్టుబడిన దానితో ఇప్పటివరకు మొత్తం 5 చిరుతలు చిక్కినట్లయింది. వీటిని శ్రీవేంకటేశ్వర జూ పార్క్ కు తరలిస్తున్నారు.