
తిరుమల శ్రీవారి దర్శనానికి రద్దీ తగ్గిపోయింది. స్వామి వారి దర్శనానికి బుధవారం మూడు గంటల సమయం పడుతోంది. ఒక కంపార్ట్ మెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. మంగళవారం 69 వేల మందికి పైగా భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం మంగళవారం రూ.4.38 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. వారం క్రితం రోజుకు 85 వేల 90 వేల మంది దాకా భక్తులు తిరుమల దర్శనానికి వచ్చారు. ప్రస్తుతం విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడంతో ఈ వారంలో రద్దీ ఒక్కసారిగా తగ్గినట్లయింది.