భూమి లేని నిరుపేదలకు లంక భూములు కేటాయించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. CM జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. CRDA పరిధిలోని R5 జోన్ లో 47 వేల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలపడంతోపాటు అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్ స్టోరేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించడం సహా హడ్కో నుంచి రూ.750 కోట్ల రుణం తీసుకోవాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలోని భూమి లేని నిరుపేదలకు వ్యవసాయ భూమితోపాటు లంక భూములు ఇవ్వాలని తీర్మానం చేసింది.
గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.454 కోట్ల పరిహారం మంజూరుకు సై అంది. యూనివర్సిటీల్లో టీచింగ్ స్టాఫ్ రిటైర్ మెంట్ వయసు 63 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ… పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. విశాఖలో ల్యాండ్స్ స్కామ్ పై సిట్ నివేదికకు ఆమోదం తెలిపిన కేబినెట్.. మరోసారి విచారణకు అనుమతిచ్చింది.