
వాలంటీర్ల(Volunteer) వ్యవస్థ(System)పై రాష్ట్రంలోని రాజకీయపార్టీల్లో రగడ నడుస్తోంది. వాలంటీర్లంతా వైకాపాకు డేటా సెండ్ చేస్తూ ప్రజల భద్రతను గాలిలో కలుపుతున్నారంటూ పవన్ కల్యాణ్ అన్న మాటలపై అధికార పార్టీ గట్టిగానే రెస్పాండ్(Respond) అవుతున్నది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లు దైవంశ సంభూతులని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి జనాల్ని కాపాడిన క్రెడిట్ వారిది అన్న ఆయన.. అలాంటి వాలంటీర్లపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కేబినెట్ మీటింగ్ లో జగన్ తీసుకున్న నిర్ణయాలు పేద ప్రజలకు మేలు చేస్తాయన్నారు. గతంలో దళితులకు భూములు ఇచ్చినా వారికి హక్కులు ఉండేవి కావని.. కానీ వారికి రైట్స్(Rights) కల్పిస్తూ CM జగన్ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమన్నారు.
వెల్ఫేర్ హాస్టళ్లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని మంత్రి నాగార్జున తెలిపారు.