
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం పేరును శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా నామకరణం చేసేందుకు TTD నిర్ణయించింది. ఈ విషయాన్ని AP కేబినెట్ లో నిర్ణయించాక కేంద్రానికి సిఫార్సు చేసే సన్నాహాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. 5 వేల ఆలయాలు నిర్మించాలని అవి BC, SC, ST, మత్స్యకార ప్రాంతాల్లో ఉండేలా చూస్తామన్నారు. ఆయన ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు.
స్విమ్స్ ఆసుపత్రిలో మెడికల్ మాఫియా నడుస్తోందని, దానికి అడ్డుకట్ట వేసేందుకు దుకాణాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. AI టెక్నాలజీ ద్వారా మూడు గంటల్లోనే స్వామి వారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.