
ఎలాంటి నిబంధనలు పాటించని ట్రావెల్ బస్సులతో(Travel Buses)ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేటు బస్సుకు మంటలు అంటుకుని 19 మంది
సజీవదహనం కాగా, మరో 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బైకును బస్సు ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఇదే హైదరాబాద్-బెంగళూరు హైవేపై గతంలోనూ బస్సు కాలిపోయి 40 మందికి పైగా సజీవదహనమయ్యారు. అలాంటి ఘటనే ఇప్పడు మరోసారి జరిగింది. ఈ బస్సులో ఎలాంటి అత్యవసర ద్వారాలు(Emergency Windows) లేవని బయటపడింది. మోటార్ సైకిల్ ను ఢీకొట్టగానే భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.